Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీ ఆడొద్దన్న అవ్వ... కర్రలతో చితక్కొట్టి చంపేసిన మనవడు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (09:39 IST)
హోలీ పండుగ రోజున ఓ ఇంట్లో విషాదకర సంఘటన జరిగింది. హోలీ పండుగ ఆడొద్దన్న అవ్వను కర్రలతో కొట్టి చంపేశాడో మనవడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. త‌న ఇంటి ముందు హోలీ ఆడొద్ద‌ని చెప్పినందుకు ఓ అవ్వ‌ను క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాది చంపేశారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఎత‌వా జిల్లా మేవ‌తి టోలా ఏరియాలో సోమ‌వారం జరిగింది.
 
ఓ 60 ఏళ్ల వృద్ధురాలు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జీవిస్తోంది. హోలీ పండుగ నేప‌థ్యంలో ఆ వృద్ధురాలి ఇంటి ముందు కొంద‌రు యువ‌కులు హోలీ ఆడారు. త‌న ఇంటి ముందు హోలీ ఆడొద్దు అని ఆ యువ‌కుల‌ను ముస‌లావిడ ఆదేశించింది. దీంతో రెచ్చిపోయిన ఆ యువ‌కులు వృద్ధురాలితో పాటు కుటుంబ స‌భ్యుల‌పై క‌ర్ర‌ల‌తో దాడి చేశారు.
 
వారి దాడిలో వృద్ధురాలి చ‌నిపోయింది. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. దాడికి పాల్ప‌డ్డ యువ‌కులంద‌రూ మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
 
ఏక్డిల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో మ‌ద్యం మ‌త్తులో ఉన్న మ‌రో యువ‌కుడు.. ట్రాక్ట‌ర్‌ను అతివేగంగా న‌డ‌ప‌డంతో పాద‌చారుల‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్ట‌డంతో ట్రాక్ట‌ర్ కూడా ధ్వంస‌మైంది. ట్రాక్ట‌ర్‌ను న‌డిపిన యువ‌కుడిని స్థానికులు పోలీసుల‌కు అప్ప‌గించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments