Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లని టవల్‌ను గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు...

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (09:26 IST)
కట్టుకున్న భార్యను ఓ భర్త అత్యంత కిరాతకంగా చంపేశాడు. తెల్లని టవల్‌ను గొంతుకు బిగించి ఊపిరాడనీయకుండా చేసి ప్రాణం తీశాడు. ఆ తర్వాత నేరుగా ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పార్థీబస్తీలో నివాసముండే శకత్వాల దర్శన్‌ అనే వ్యక్తి కూరగాయల వ్యాపారి. ఈసీఐఎల్‌లో కూరగాయలు విక్రయిస్తూ స్వయం ఉపాధిపొందుతున్నాడు. ఈ క్రమంలో సౌందర్య అనే యువతిని ప్రేమించి పెంళ్లి  చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. అయితే, దంపతులిద్దరికీ రోజూ కలిసి మద్యం సేవించే అలవాటు ఉన్నది.
 
అయితే, ఈ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన భార్యకు విడాకులు ఇవ్వాలని దర్శన్ భావించాడు. కానీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో తిరిగి కలిసి జీవనం సాగిస్తున్నారు. అనంతరం గత వారం రోజులుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తన భార్యను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేసుకున్నాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన అనంతరం తెల్ల టవల్‌తో భార్య గొంతు బిగించి, హతమార్చాడు. అనంతరం టవల్‌తో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments