Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ఐదుగురి సజీవదహనం

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (10:16 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో దారుణం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న ట్యాంకర్ లారీని ఓ కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు సజీవదహనమయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ 32 కేడబ్ల్యూ 6788 కారులో ఐదుగురు ఢిల్లీ వైపు వెళ్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఖండౌలి పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో, టోల్‌ప్లాజాకు నాలుగు కిలోమీటర్ల ముందు ఓ ట్యాంకర్‌ను ఓవర్‌టెక్‌ చేసేందుకు ప్రయత్నించింది. 
 
ఆ సమయంలో కారు వేగంగా ఉండటంతో నియంత్రణలోకి రాలేదు. దీంతో డీజిల్‌ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. వారు సెంట్రల్‌ లాక్‌ కావడంతో వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కారు మొత్తం మంటలు వ్యాపించి ఐదుగురు కారులోనే దహనమయ్యారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments