Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెరీర్ మొగ్గ దశలోనే వుంది ... హద్దులు దాటబోను : పాయల్ రాజ్‌పుత్!

Advertiesment
కెరీర్ మొగ్గ దశలోనే వుంది ... హద్దులు దాటబోను : పాయల్ రాజ్‌పుత్!
, ఆదివారం, 20 డిశెంబరు 2020 (12:36 IST)
తన కెరీర్ ఇపుడు మొగ్గ దశలోనే ఉందని, అందాల ఆరబోతలో హద్దులు దాటబోనని "ఆర్ఎక్స్ 100" భామ పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమకు ఆర్ఎక్స్ 100 అనే చిత్రం ద్వారా పరిచయమైన భామ పాయల్. ఈ ఒక్క చిత్రంతోనే ఈ అమ్మడు రేంజ్ తారా స్థాయికి చేరింది. ఇప్పటివరకు చేయనటువంటి పాత్రను చేసి మంచి మార్కులు కొట్టేసింది. 
 
ఇపుడు తన సినీ కెరీర్‌, ఇతర అంశాలపై ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ, 'నా తొలిచిత్రం "ఆర్‌ఎక్స్‌ 100" విడుదల తర్వాత అందరూ నన్ను ఓ రాణిలా చూశారు. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నిజంగా సంతోషంగా ఉంది. 'వెంకీ మామ' విజయంతో నా పట్ల వాళ్ల అభిమానం రెట్టింపైంది" అని చెప్పింది. 
 
అంతేకాకుండా, తొలి నుంచి గ్లామర్‌ పాత్రలకే ప్రాధాన్యతనిస్తున్న ఈ అందాలభామతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే ‘నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. కానీ నాకు లభించిన పాత్రలు చేస్తూ వస్తున్నాను. గ్లామర్‌ పాత్రలు పోషించినా ఎప్పుడూ నేను హద్దులు దాటను. నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. నా కెరీర్‌ ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్‌లో తప్పకుండా అన్ని జోనర్‌ సినిమాలు, అని తరహా పాత్రలను పోషిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడల్ట్ కంటెంట్ వెబ్‌సిరీస్‌లో రెచ్చిపోయిన బబ్లీ బ్యూటీ!