దేశంలో 38 వేల కరోనా కొత్త కేసులు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (10:58 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముందురోజు 40 వేలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా 13 శాతం తగ్గాయి. నిన్న 38,628 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోసారి మరణాల సంఖ్య పెరిగింది. నిన్న 617 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4.27లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం 4,12,153 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29 శాతంగా ఉండగా.. రికవరీరేటు 97.37 శాతానికి చేరింది. తాజాగా 40వేల మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు మూడు కోట్ల 10లక్షలకు చేరాయి.
 
50 కోట్ల డోసులు పంపిణీ..
కరోనాపై పోరాటంలో భాగంగా జనవరి 16న దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. దానికింద ఇప్పటివరకు 50 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 49.5లక్షల మంది టీకా వేయించుకున్నట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments