Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపరేషన్ సింధు - ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చిన 311 మంది ఇండియన్స్

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (09:48 IST)
ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు వైమానికదాడులు చేస్తున్నాయి. ఈ కారణంగా ఇరాన్‌లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో ఇరాన్‌లో చిక్కున్న భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానిక తీసుకొస్తోంది. తాజాగా మరో 311 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వీరితో కలుపుకుని స్వదేశానికి వచ్చిన మొత్తం భారతీయుల సంఖ్య 1428కి చేరుకుంది. 
 
అమెరికా బాంబర్ విమానాలు ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై దాడులు ముమ్మరం చేశాయి. దీంతో మధ్యప్రాశ్యంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్లిష్టపరిస్థితుల నడుమ తాజాగా మరో 311 మంది భారతీయులు ఇరాన్‌లోని మష్హద్ నగరం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నారు. 
 
ఈ తరలింపు ప్రక్రియను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ సాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆదివారం తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. జూన్ 22వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు మష్హద్ నుంచి ప్రత్యేక విమానంలో 311 మంది భారతీయ పౌరులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఇరాన్ నుంచి ఇప్పటివరకు 1428 మంది భారతీయులను సురక్షితంగా తరలించగలిగాం అని ఆయన తన ప్రకటలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments