హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ - ఉప్పొంగుతున్న పార్వతి నది

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (20:47 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుంభవృష్టి కురుస్తోంది. దీంతో పార్వతి నదికి ఉప్పొంగి ప్రవహిస్తుంది. హిందుస్థాన్ - టిబెట్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. నిర్మాండ్‌లో వరద వంటి పరిస్థితి, ప్రాణనష్టం లేదు. గత నెలలో రూ.250 కోట్లతో లార్జీ ప్రాజెక్టు పునఃప్రారంభంకానుంది. లార్జీ వద్ద కొండ చరియలు నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక యంత్రాంగం తెలిపింది. అనేక చెట్లు కూలిపోయాయి. 
 
నిర్మాండ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, కుండపోత వర్షాల వల్ల వరద లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, హిందుస్థాన్ - టిబెట్ జాతీయ రహదారి జఖ్రీ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 


సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - వచ్చే యేడాది రెండుసార్లు.. 
 
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పబ్లిక్ పరీక్షా విధానంలో కీలక మార్పులు చేసింది. వచ్చే యేడాది నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలను రెండుసార్లు నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇదే విషయంపై సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సంజయ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ఈ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా తొలి దశ పరీక్షలు ఫిబ్రవరిలోనూ, రెండో దశ పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలిపారు. తొలి ఫలితాలు, ఏప్రిల్, రెండో దశ ఫలితాలు జూన్ నెలలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే, తొలి దశ పరీక్షలకు విద్యార్థులు విధిగా హాజరుకావాలని, రెండో దశ పరీక్షలు మాత్రం ఐచ్ఛికం అని తెలిపారు. 
 
తమ పెర్ఫారమెన్స్ పెంచుకోవాలని ఆశించే విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మాత్రం అకడమిక్ సెషన్‌లోనే ఒకేసారి ఉంటుందని పేర్కొన్నారు. రెండో దశలో విద్యార్థులు సైన్స్, గణితం, సోషల్ సైన్స్, లాంగ్వేజ్‌లలో మూడు సబ్జెక్టులను ఎంచుకుని బెటర్‌మెంట్ కోసం రాసుకోవచ్చని ఆయన తెలిపారు.

CBSE approves twice-a-year board exams for Class 10 from 2026

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments