Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి పడుకో.. ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ చేతికిస్తా... ఏమంటావ్...

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (15:48 IST)
గుజరాత్ రాష్ట్ర పోలీసు శాఖలో పని చేసే మహిళా ఉద్యోగినుల పట్ల పైస్థాయిలో ఉండే పోలీసు ఉన్నతాధికారుల లైంగిక వేధింపులు శృతిమించిపోయాయి. బదిలీ కోసం దరఖాస్తు చేసుకుంటే తమ కోర్కె తీర్చితేగానీ బదిలీ ఆర్డర్‌పై సంతకం చేయబోమని నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. దీంతో ఆ మహిళా ఉద్యోగినులు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళారు. ఇది చివరకు ముఖ్యమంత్రికి చేరింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిజానికి గత కొంత కాలంగా గుజరాత్ పోలీస్ శాఖలో లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. నచ్చిన చోటుకు బదిలీ కావాలంటే తమ కోరిక తీర్చాలని సీనియర్ అధికారులు వేధిస్తున్నారంటూ 25 మంది మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు వీరు సూరత్ పోలీస్ కమిషనర్ సతీశ్ శర్మకు ఫిర్యాదు చేశారు.
 
ఈ మేరకు కమిషనర్ సతీశ్‌కు 4 పేజీల లేఖను అందజేశారు. బదిలీ కావాలంటే కోరిక తీర్చాలనీ, లేదంటే భారీగా నగదు ముట్టజెప్పాలని ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. మరో సీనియర్ అధికారి అయితే 'యూనిఫాం సరిచేసుకో' అంటూ తాకరాని చోట తాకారని ఓ హోంగార్డు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
 
దీంతో ఈ విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లామనీ, ఈ ఘటనపై జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ జరుపుతోందని కమిషనర్ సతీశ్ శర్మ వెల్లడించారు. ఈ ఫిర్యాదు కాపీని ముఖ్యమంత్రి రూపానీతో పాటు హోంమంత్రికి కూడా పంపినట్లు తెలిపారు. విచారణలో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం