మహిళలు తప్పనిసరిగా రోజుకు రెండు గ్లాసుల పాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారమైన పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది.
మహిళలకు వయస్సు మీరే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి. అందుకే మహిళలు చిన్నప్పటి నుంచే పాలను తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలలో ప్రోటీన్లు, క్యాల్షియం, ఖనిజ లవణాలు పుష్కలంగా వుంటాయి. ఇందులో ఎ, బి, సి, మరియు డి విటమిన్లు కూడా లభిస్తాయని.. తద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావని.. న్యూట్రీషియన్లు చెప్తున్నారు.
టీనేజీ అమ్మాయిలు రోజును నాలుగు గ్లాసుల పాలు తీసుకోవాలని 25 ఏళ్లు దాటిన మహిళలు రోజుకు రెండు గ్లాసుల పాలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. పాలు తాగేందుకు ఇష్టపడని వారైతే పాల నుంచి తయారైన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, ఐస్ క్రీములు, చాక్లేటులు మొదలైన వాటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.