Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో కరోనా విలయతాండవం.. ధారావిని తలపిస్తోన్న కన్నగినగర్

Webdunia
మంగళవారం, 12 మే 2020 (15:27 IST)
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడులో ఇప్పటి వరకు 8,002 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,051 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేవలం చెన్నైలోనే 4,371 కేసులు నమోదు అయ్యాయి.

ఈ నేపథ్యంలో చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో చాపకింద నీరులా విస్తరించిన కరోనా వైరస్‌.. తాజాగా స్లమ్‌ ఏరియా అయిన కన్నగి నగర్‌కు వ్యాపించింది. కన్నగి నగర్‌ ప్రస్తుతం మరో ధారవిని తలపిస్తోంది. 
 
ఈ ప్రాంతంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కన్నగి నగర్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు 30 వేలకు పైగా నివాసాలు ఉన్నాయి. ఈ ఏరియాలో ఒకే రోజు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అధికారులు కూడా అప్రమత్తమై కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా కోయంబేడు మార్కెట్‌ కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ మార్కెట్‌లో 527 మందికి కరోనా సోకింది. దీంతో కోయంబేడు మార్కెట్‌ను పోలీసులు మూసివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments