Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి షాక్ : కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎంపీ

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (12:57 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమె గతంలోనే కమలం పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, కాషాయం పార్టీపై చాలా సార్లు బహిరంగ విమర్శలు  కూడా చేశారు. 
 
ఆమెతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేత రాకేశ్‌ కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింధియా సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. గతేడాది బీఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 
 
బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆమెకు సాన్నిహిత్యం ఉంది. 2000 సంవత్సరంలో బీజేపీలో చేరిన‌ పూలే 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె 2014 సాధారణ ఎన్నికల్లో బహ్రైచ్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments