Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్.. రుతుస్రావం వయస్సులో వున్న ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు..

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (10:46 IST)
అవును. అయ్యప్ప స్వామిని మహిళలు దర్శించుకున్నారు. ఆలయం అపవిత్రమైపోయిందని భక్తులు వాపోతున్నారు. సుప్రసిద్ధ క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని అన్నీ వయో వర్గాలకు చెందిన మహిళలు దర్శించుకోవచ్చునని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. భక్తులు మహిళా ప్రవేశానికి అడ్డుగా నిలిచారు. అయినప్పటికీ కేరళ సర్కారు తన పంతాన్ని నెగ్గించుకుంది. 
 
అయ్యప్ప దేవాలయానికి వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు ఈ తెల్లవారుజామున స్వామిని దర్శించుకున్నారు. మండల పూజలు ముగిసి మకరవిళక్కు పూజల కోసం ఆలయాన్ని తెరిచి వుంచారు.

మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు ఇంకా సమయం ఉండగా, భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, పోలీసులు భారీ భద్రత మధ్య 40లోపు వయసున్న ఇద్దరు మహిళలకు స్వామి దర్శనం చేయించారు. వారు ఆలయానికి సమీపంలోకి వచ్చిన తరువాత, భక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టారు. 
 
ఇంకా బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలకు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం లభించింది. రుతుస్రావం వయసులో ఉన్న మహిళలు స్వామిని దర్శించుకున్నారని, తాము అడ్డుకోలేకపోయామని భావించిన అయ్యప్ప భక్తులు బోరున విలపించారు. ఆలయం అపవిత్రమైపోయిందని పలువురు వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments