Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవంతిపోరలో ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

Webdunia
మంగళవారం, 31 మే 2022 (08:37 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అవంతిపోరలో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరికొందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అవంతిపోరా జిల్లాలోని రాజ్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సోమవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. 
 
దీంతో భద్రతా బలగాలు, పోలీసుల సంయుక్త బృందం అక్కడికి చేరుకొని.. ఉగ్రవాదుల కోసం కార్డన్‌ సెర్చ్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే సెర్చ్‌ పార్టీ అనుమానస్పదంగా కనిపించిన ప్రదేశం వైపు వెళ్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం వారికి ధీటుగా బదులిచ్చింది.
 
బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. కాల్పుల్లో మృతి చెందిన వారిని త్రాల్‌కు చెందిన షాహిద్‌ రాథర్‌, షోపియాన్‌కు చెందిన ఉమర్‌ యూసుఫ్‌గా గుర్తించినట్లు ఐజీ విజయ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. 
 
ఇద్దరు పలు నేరాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇదిలావుండగా.. గడిచిన 24 గంటల్లో కాశ్మీర్‌లో కాల్పులు జరుగడం ఇది రెండోసారి. సోమవారం వేకువజామున సైతం పుల్వామాలో ఇద్దరు జైషే ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments