Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లడఖ్ సెక్టార్‌లో ప్రమాదం - ఏడుగురు భారత జవాన్లు మృతి

Advertiesment
Ladhak
, శుక్రవారం, 27 మే 2022 (18:19 IST)
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లడఖ్‌లో ఘోరం జరిగింది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం ఒకటి అదుపుతప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో 19 మంది సైనికులు గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఆర్మీ అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రమాద స్థలానికి ఎయిర్ అంబులెన్స్ పంపించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్‌ హనీఫ్‌లోని ఒక పార్వర్డ్ లొకేషన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో ఆర్మీ వాహనంలో  26 మంది సైనికులు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క సంతకంతో కేసులన్ని ఎత్తివేస్తాం : కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపు