Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క సంతకంతో కేసులన్ని ఎత్తివేస్తాం : కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపు

Advertiesment
atchennaidu
, శుక్రవారం, 27 మే 2022 (16:54 IST)
వైకాపా నేతలు అధికారమదంతో తమ పార్టీ కార్యకర్తలపై పెడుతున్న కేసులను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంతకంతో ఎత్తివేస్తామని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఒంగోలు వేదికగా టీడీపీ మహానాడు శుక్రవారం ప్రారంభమైంది. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మహానాడుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. పార్టీ ఆవిర్భవించి 40 యేళ్లు కాగా, ఈ యేడాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి కూడా కావడం ఈ మహానాడు చాలా ప్రత్యేకమైనదన్నారు. 
 
తమ పార్టీ అధినేత చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ అంటే కేవలం అధికారంలో ఉన్నపుడే మాత్రమే రాజకీయం చేసే పార్టీ కాదని అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉండే పార్టీ అని చెప్పారు. 
 
వైకాపా పాలనలో భయపడిపోయిన కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు పర్యటనలకు ఉత్తరాంధ్రకు మించి రాయలసీమలో మంచి స్పందన వచ్చిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలతో చంద్రబాబు సీఎం అవుతారని జోస్యం చెప్పారు. వైకాపా మంత్రులు చేపట్టిన బస్సు యాత్రలో అలీబాబా 40 దొంగలు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటోమోటివ్‌ కియా ఈవీ6ను ఆవిష్కరించిన నటి క్యాథెరిన్ థ్రెసా, రూ. 3 లక్షలు చెల్లించి కారు బుక్ చేస్కోండి