Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల బాలికను గర్భవతిని పన్నెండేళ్ళ బాలుడు

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (11:25 IST)
పదేళ్ళ బాలికను పన్నెండేళ్ళ బాలుడు గర్భవతిని చేశారు. ఈ దారుణం మహారాష్ట్రలోని పల్ఘర్‌లో జరిగింది. పన్నెండేళ్ల బాలుడు పదేళ్ల బాలికపై నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్న దారుణ ఘటన వెలుగు చూసింది. 
 
ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడం కలకలం రేపుతోంది. శనివారం బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం బయటకొచ్చింది. తనకు కడుపులో విపరీతంగా నొప్పి వస్తోందని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పడంతో వారు నిర్ఘాంత పోయారు.
 
వైద్యులు చెప్పింది విని షాక్‌కు గురైన తల్లిదండ్రులు తేరుకుని ఏం జరిగిందంటూ బాలికను ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. తనపై ఓ కుర్రాడు నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నట్టు చెప్పడంతో గుండె పగిలినంత పనైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, నిందితుడైన బాలుడిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. ఇటీవల తమిళనాడులోనూ ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. బాలికపై అత్యాచారం చేసిన 12వ తరగతి విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి అని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం