Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం చేసుకున్నాడు.. భార్యపై పది మంది అత్యాచారం.. న్యాయం కోసం భర్త పోరాటం..

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (17:54 IST)
భార్య అత్యాచారానికి గురైతే భర్త న్యాయం కోసం పోరాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. మాయమాటలు పలికి ఓ వివాహితపై బ్యాంకు ఉద్యోగితో పాటు అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే తన భార్య కోసం ఆమె భర్త నిందితులకు శిక్ష పడాలని న్యాయం కోసం పోరాడుతున్నాడు. 
 
ప్రేమించి వివాహం చేసుకున్న ఆ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అబ్బాయి కోసం మూడోసారి గర్భం ధరించిన బాధితురాలు వైద్య ఖర్చుల కోసం వడ్డీకి డబ్బులు తీసింది. బ్యాంకు రుణాన్ని తిరిగి కట్టేందుకు కేరళ, కొల్లంకు ఎలక్ట్రీషియన్ పని కోసం వెళ్లాడు భర్త. ఇక బాధితురాలు ఇద్దరమ్మాయిలతో ఒంటరిగా జీవనం సాగించింది.
 
అయితే భర్త తన కోసం పంపే నగదును పక్కనున్న బ్యాంకులో డ్రా చేస్తూ వచ్చేది. ఇలా బ్యాంకుకు వస్తూ వెళ్లే బాధితురాలిపై బ్యాంకు ఉద్యోగి కన్నుపడింది. బ్యాంకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన శివకార్తీకేయన్ అనే వ్యక్తి... ఆమెను లైంగికంగా వేధించాడు. దీన్ని వీడియోగా తీసుకున్నాడు. ఆ వీడియోను చూపెట్టి శివకార్తీకేయన్ పలుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు తనతోటి ఉద్యోగులను కూడా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడేలా చేశాడు. 
 
ఈ విషయాన్ని తన బంధువులతో చెప్పిన బాధితురాలు అతని చేతిలోనూ నలిగిపోయింది. అతడూ ఆమెను తన స్నేహితులకు భోగ వస్తువుగా మార్చాడు. కానీ కట్టుకున్న భర్తకు ఈ విషయం చెప్పలేక నరకయాతన అనుభవించిన బాధితురాలికి.. భర్త నుంచి పూర్తి మద్దతు లభించింది. ప్రేమించిన వివాహం చేసుకున్న భర్తకు ఈ విషయం తెలియరావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఈ మేరకు కేసు నమోదు చేసుకునేందుకు ముందు అంగీకరించని పోలీసులు.. ఆపై కేసు నమోదు చేసుకుని.. బ్యాంకు ఉద్యోగి, బాధితురాలి బంధువును అరెస్ట్ చేశారు. ఇంకా ఆమెపై అత్యాచారానికి పాల్పడిన పది మందిని గాలిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో పెను సంచలనం సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం