ఓసూరు ప్రభుత్వ ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. ప్రసవం చేసేటప్పుడు వైద్యులు ప్రవర్తించిన పనితీరు వైద్యవృత్తికే కళంకం తెచ్చేలా వుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ఓసూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి కంటూ వెళ్లిన మహిళకు చుక్కలు కనిపించాయి. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ మహిళ కడుపులో ఈ కర్చీఫ్ లాంటి వస్త్రాన్ని వుంచి కుట్టేశారు.
ఓసూరుకు చెందిన కవిత అనే మహిళకు ఈ ఘటన ఎదురైంది. ప్రసవానికి మూడు నెలల తర్వాత అప్పుడప్పుడు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లిండి. అక్కడ ఆ మహిళను పరీక్షించిన వైద్యులు స్కాన్ చేయించారు.
ఈ స్కాన్‌లో ఆమె కడుపులో వస్త్రంతో తయారు చేసిన ఫేస్ గ్లౌజ్ వుండటాన్ని గమనించారు. ఇది తెలుసుకున్న కవిత బంధువులు ఆస్పత్రిని చుట్టుముట్టారు. చివరికి పోలీసులు రంగంలో దిగి.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కవిత బంధువులు ఆందోళనను వీడారు. కవితను మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.