యూపీలో భారీ వర్షాలు.. లక్నో - ఉన్నావోలో 12 మంది మృతి

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (10:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో మట్టి ఇళ్లు కూలిపోతున్నాయి. లక్నలో గోడలు కూలి 9 మంది, ఉన్నావోలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసింది. 
 
ఈ రెండు ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్... బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా ఈ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, ఈ రెండు ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. 
 
అల్పపీడనం కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. రేపటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు వెల్డలించారు. దీంతో శుక్రవారం అన్ని విద్యా సంస్థలకు అదికారులు సెలవులు ప్రకటించారు. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments