Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసులు - ఏపీలో కూడా..

Webdunia
బుధవారం, 26 మే 2021 (16:32 IST)
దేశంలో ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. మరోవైపు, దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 11,717 కేసులు నమోదయ్యాయి. 
 
కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్ లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి. మరోవైపు బ్లాక్ ఫంగస్‍ను మహమ్మారిగా గుర్తించాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. 
 
ఇదే అంశంపై గత శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ మన దేశానికి సరికొత్త సవాల్‌గా బ్లాక్ ఫంగస్ అవతరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. నొప్పులు, కళ్లు, ముక్కు చూట్టూ ఎర్రబడటం, జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపు వాంతులు వంటివి బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా చెబుతున్నారు. 
 
ఇదిలావుండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఏకంగా 50కి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments