Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ... 11 మంది సజీవదహనం

ఠాగూర్
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (11:34 IST)
ఢిల్లీ పెయింట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది ఆహుతయ్యారు. పక్కనే గోడౌన్లకు వ్యాపించిన మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయలయ్యాయి. వీరిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఢిల్లీ నగర శివారు ప్రాంతంలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం మంటలు ఎసిగిపడ్డాయి. కాస్త వ్యవధిలో చుట్టుపక్కల ఉన్న గోడౌన్లకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. ఓ కానిస్టేబుల్ సహా మరో నలుగురికి గాయాలయ్యాయి. మొత్తం 22 ఫైరింజన్లతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. గురువారం రాత్రి వరకు ఏడుగురి మృతదేహాలను గుర్తించగా, శుక్రవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. 
 
దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 11 మందికి చేరింది. మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఆలిపూర్‌లోని దయాల్ పూర్ మార్కెట్‌ ఏరియాలో ఉన్న పెయింట్ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలో నిల్వ చేసిన వివిధ రసాయనాల వల్ల పేలుడు జరిగి మంటలు ఎగిసిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయని, విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments