Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బిడ్డను నేనేం చేయాలి : తల్లి అయిన పదేళ్ళ బాలిక ప్రశ్న

పదేళ్ళ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం స్పృహలోకి వచ్చిన ఆ బాలిక పక్కలో బిడ్డను పడుకోబెడితే.. ఈ బిడ్డను నేనేం చేయాలి అంటూ ప్రశ్నించడంతో వైద్య సిబ్బంది విస్తుపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే.

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (11:55 IST)
పదేళ్ళ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం స్పృహలోకి వచ్చిన ఆ బాలిక పక్కలో బిడ్డను పడుకోబెడితే.. ఈ బిడ్డను నేనేం చేయాలి అంటూ ప్రశ్నించడంతో వైద్య సిబ్బంది విస్తుపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చండీగఢ్ రాష్ట్రంలో సమీప బంధువుల చేతిలో ఓ బాలిక పలుమార్లు అత్యాచారానికి గురైంది. ఫలితంగా ఆ బాలిక గర్భందాల్చింది. అయితే, కడుపులో రాళ్లు ఉన్నాయనీ, ఆపరేషన్‌ చేయాలని చెప్పి ఆమెను తల్లిదండ్రులు వైద్యశాలకు తీసుకునిరాగా, ఆ బాలిక గర్భందాల్చివుందనే విషయం వైద్యులు చెప్పేంతవరకు బాలిక తల్లిదండ్రులకు తెలియదు. 
 
అదేసమయంలో బాలికకు గర్భస్రావం చేసేందుకు కోర్టును ఆశ్రయించగా, అందుకు సుప్రీంకోర్టు నిరాకరిండంతో చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలోని ఐసీయూలో వైద్యుల బృందం గురువారం ఆమెకు ఆపరేషన్‌ నిర్వహించి కాన్పు చేశారు.
 
ముగ్గురు గైనకాలజిస్టులు, నియోనటాలజిస్ట్‌, పిడియాట్రిషియన్‌ వైద్య బృందంలో ఉన్నారని బాలిక ఆరోగ్య పర్యవేక్షణ కోసం నియమించిన కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ దాసరి హరీశ్‌ తెలిపారు. ఇది అసాధారణ గర్భమైనా సిజేరియన్‌ సజావుగా సాగిందనీ, శిశువు బరువు (2.2 కేజీలు) కొంచెం తక్కువగా ఉండటంతో ఐసీయూలో ఉంచామని వెల్లడించారు. బాలిక ఆరోగ్యం స్థిరంగానే ఉందన్నారు. అయితే, కన్నబిడ్డను చూసిన ఆ బాలిక... ఏం చేయోలో తెలియని అయోమయ స్థితిలో ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments