Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో కూర్చోబెట్టాల్సింది అమ్మాయిలను కాదు... అబ్బాయిలను : బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్

హర్యానా రాష్ట్రంలో ఓ ఐఏఎస్ కుమార్తెను హర్యానా రాష్ట్ర బీజేపీ చీఫ్ సుభాష్‌ బరాలా కుమారుడు వికాస్‌ బరాలా లైంగికంగా వేధించడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో వికాస్‌తో పాటు ఆయన స్నేహితుడిని

Advertiesment
ఇంట్లో కూర్చోబెట్టాల్సింది అమ్మాయిలను కాదు... అబ్బాయిలను : బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్
, శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:28 IST)
హర్యానా రాష్ట్రంలో ఓ ఐఏఎస్ కుమార్తెను హర్యానా రాష్ట్ర బీజేపీ చీఫ్ సుభాష్‌ బరాలా కుమారుడు వికాస్‌ బరాలా లైంగికంగా వేధించడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో వికాస్‌తో పాటు ఆయన స్నేహితుడిని అరెస్టు చేయగా, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
 
ఈ ఘటనపై సుభాష్ బరాలా స్పందిస్తూ అసలు అమ్మాయిలకు అర్థరాత్రిపూట వీధుల్లో ఏంపని అంటూ ప్రశ్నించారు. దీనిపై బీజేపీకి చెందిన ఎంపీ, నటి కిరణ్ ఖేర్ ఘాటుగానే స్పందించారు. ఇంట్లో కుర్చోపెట్టాల్సింది అమ్మాయిలను కాదని అబ్బాయిలనని ఆమె అభిప్రాయపడ్డారు‌. ఈ కేసుతో రాజకీయాలకు ముడిపెట్టడం భావ్యం కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
 
అమ్మాయిలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, వారిని రాత్రివేళల్లో బయటికి పంపకూడదని.. అయినా రాత్రివేళల్లో రోడ్లపై వారికి ఏం పని ఉందన్న మరో బీజేపీ ఎంపీ రాంవీర్ భట్టి వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఓ యువతిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు.. ఆయనకు నోరెలా వచ్చిందంటూ మండిపడ్డారు. 
 
'కేవలం రాత్రివేళల్లోనే ఎందుకు ఇలా జరుగుతోంది. పగలు ఈ దుర్మార్గాలు తక్కువన్న విషయం పక్కనపెడితే.. రాత్రివేళల్లో బయటకు రాకుండా ఉండాల్సింది అమ్మాయిలు కాదు, అబ్బాయిలు. యువకులకు రాత్రిపూట రోడ్లపై ఏం పని ఉంది. వారిని ఆ సమయంలో ఇంట్లో కూర్చోపెడితే ఈ సమస్యలే తలెత్తవని' ఆమె అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళికంటూ బయల్దేరి జైలు డాబాపై దిగిన హెలికాఫ్టర్.. పరుగులు తీసిన సిబ్బంది..