Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహర్ యువతకు శుభవార్త చెప్పిన సీఎం నితీశ్

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (13:16 IST)
బీహార్ రాష్ట్ర యువతకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుభవార్త చెప్పారు. త్వరలోనే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఇటీవల బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ తన ప్రత్యర్థి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 
 
అయితే, తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. ఇపుడు ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో సీఎం నితీష్ కుమార్ ఈ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. 
 
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన నితీశ్... తమ సంకీర్ణ ప్రభుత్వ ఆకాంక్ష మేరకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పన కోసం తాము పెద్ద ఎత్తున కృషి చేస్తామని తెలిపారు. 
 
కాగా, స్వాతంత్ర్యం దినోత్సవం రోజున సీఎం చేసిన ప్రకటనపై తేజస్వీ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అతిపెద్ద ప్రకటన చేశారంటూ వ్యాఖ్యానించారు. సీఎం హామీని నెరవేర్చేందుకు రెండు పార్టీలు కలిసికట్టుగా పని చేస్తాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments