బీహార్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఈ రాష్ట్రంలోని సరన్ జిల్లా ఛప్రా నగరానికి సమీపంలో అక్రమ పటాకుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకునివున్నట్టు సమాచారం. వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని సరన్ ఎస్పీ సంంతోష్ కుమార్ వెల్లడించారు.
మొత్తం మూడు అంతస్తులు కలిగిన భవనంలో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఫలితంగా దాదాపు గంట సేపు ఇక్కడ శబ్దాలు వచ్చాయి. ఈ భారీ పేలుడుకు మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని, బిల్డింగ్‌లో చాలాభాగం కుప్పకూలిపోయిందని ఎస్పీ సంతోష్ వెల్లడించారు.