Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై మంత్రి ఉషశ్రీ హల్చల్... 50 మందితో దర్శనం

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (12:42 IST)
తిరుమల శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ల దూరం సాధారణ భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. కానీ, అధికార వైకాపా నేతలు మాత్రం కొండపై ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణ భక్తులతో తమకెలాంటి సంబంధం లేనట్టుగా, వారు పడే కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ తిరుమల కొండపై హల్చల్ సృష్టించారు. 
 
ఆమె ఏకంగా 50 మంది అనుచరులతో కలిసి కొండపైకి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మరో 10 మంది అనుచరులు సుప్రభాతం టిక్కెట్లు పొందారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్నప్పటికీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి తితిదే అధికారులు టిక్కెట్లను జారీచేశారని భక్తులు మండిపడుతున్నారు. పైగా, ఈ విషయాన్ని ప్రస్తావించిన జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె సెక్యూరిటీ సిబ్బంది వీడియో జర్నలిస్టులను కిందకు తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
కాగా వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రతి రోజూ కనీసం 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 92 వేల మంది భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments