Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో భారత్‌కి 10 కోట్ల డోసుల రష్యా వ్యాక్సిన్‌ .. 30 కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందాలు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:10 IST)
ప్రపంచంలోనే మొట్టమొదటి రిజిస్టర్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’ 10 కోట్ల డోసులు భారత్‌ ప్రజలకు అందుబాటులో రానుంది. భారత్‌లో కూడా వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేపట్టనున్నట్లు రష్యా డైరెక్ట్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డిఐఎఫ్‌) తెలిపింది.

భారత్‌లోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థల సహకారంతో 30 కోట్ల డోసుల ఉత్పత్తికి రష్యా ఒప్పందాలు కుదుర్చుకోగా, వాటిలో 10 కోట్ల డోసులను డాక్టర్‌ రెడ్డీస్‌ ద్వారా దేశంలో పంపిణీ చేయించనుంది. ఈ వివరాలను డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ కూడా ధ్రువీకరించారు.

‘స్పుత్నిక్‌-వి’ మూడోదశ ప్రయోగ పరీక్షలు, పంపిణీ విషయంలో ఆర్‌డీఐఎ్‌ఫతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రయల్స్‌కు అనుమతుల అంశం ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థల పరిశీలనలో ఉందని తెలిపారు.

2020 చివరి నాటికి భారత్‌కు ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్నామని, అయితే భారత్‌లోని రెగ్యులేటరీ అధికారుల అనుమతికి లోబడి ఉంటుందని ఆర్‌డిఐఎఫ్ తెలిపింది. ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ను రష్యా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments