Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కు ద్వారా ‘కొవాగ్జిన్’ టీకా!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (11:25 IST)
బయోటెక్ దేశీయంగా తయారుచేసిన ‘కొవాగ్జిన్’ టీకా వినియోగం దేశంలో ఇప్పటికే ప్రారంభం కాగా, ఇప్పుడు ముక్కు ద్వారా ఇచ్చే మరో టీకాను అభివృద్ధి చేసింది. ఇప్పుడీ టీకాకు క్లినికల్ పరీక్షల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, గ్రీన్ సిగ్నల్ లభించింది.

పూర్తిస్థాయి చర్చల అనంతరం నాజల్ టీకా క్లినికల్ పరీక్షలకు అనుమతి ఇస్తున్నట్టు కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) పేర్కొంది. నిబంధనల మేరకు 75 మంది వలంటీర్లపై పరీక్షలు నిర్వహించి సేఫ్టీ-ఇమ్యునోజెనిసిటీ సమచారాన్ని సేకరించాలని నిపుణుల కమిటీ సూచించింది.
 
నాజల్ టీకా అభివృద్ధి కోసం భారత్ బయోటెక్ గతేడాది సెప్టెంబరులో అమెరికాలోని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్-సెయింట్ లూయిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టీకా కనుక అందుబాటులోకి వస్తే అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు మినహా మిగిలిన దేశాల్లో విక్రయించే హక్కులు భారత్ బయోటెక్‌కు ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments