2020-21 వార్షిక బడ్జెట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. కరోనా వ్యాక్సిన్ కోసం రూ. 35 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు.
దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరోగ్య రంగంలో రూ. 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని, దీనికి పిఎం ఆత్మనిర్భర్ భారత్ ఆరోగ్య పథకం వర్తింపజేస్తామని, కొత్తగా 9 బిఎస్‌ఎల్- స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర కేంద్రాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు.