Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగి ఆదిత్యనాథ్ వింత చర్యలు... ప్రచారం కోసం అలా చేశారు...

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (10:37 IST)
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఆయనపై మూడు రోజుల పాటు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 
 
మంగళవారం గోరఖ్‌నాథ్ దేవాలయంలో భక్తులకు హనుమాన్ చాలీసా చదివి వినిపించారు. ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉండే యోగి చాలీసాను అత్యంత భక్తిశ్రద్ధలతో పఠించిన వైనం భక్తులను ఆకట్టుకుంది. స్థానిక గోరఖ్‌నాథ్ మఠానికి ఆయన ప్రధాన గురువు అని తెలిసిందే.
 
ఇక, బుధవారం తన నివాసంలో ఓ ట్రిపుల్ తలాక్ బాధితురాలితో మాట్లాడి ఆమెలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా వాసి నజియా ఇటీవలే ట్రిపుల్ తలాక్ కారణంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తన నివాసంలో ఆమెతో మాట్లాడుతూ అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 
ఆపై యోగి ఓ దళితుడి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆ దళితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లను విస్మయానికి గురిచేశారు. యోగి తన భోజనాన్ని అక్కడే ముగించడం కూడా ఎవరి ఊహకు అందలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments