Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీపై దండెత్తిన పసుపు రైతులు... వారణాసిలో పోటీ

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (14:15 IST)
ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ ప్రాంతానికి చెందిన పసుపు రైతులు దండెత్తారు. వీరికి అనేక మంది సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 17వ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ స్థానంలో ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పసుపు రైతులు కూడా నరేంద్ర మోడీపై పోటీ చేయనున్నారు. ఈ మేరకు వారు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరంతా వారణాసిలో నామినేషన్లు వేసేందుకు వెళ్లారు. వీరిని స్థానిక బీజేపీ నేతలు, ఇంటెలిజెన్స్ పోలీసులు ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేసినా.. స్థానిక రైతుల నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. 
 
నామినేషన్లు వేసేందుకు శనివారం రోజు వారణాసికి చేరుకున్న రైతులను ఇబ్బంది పెట్టేందుకు స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నించారు. నామినిగా ఉండేందుకు స్థానికులు ఎవ్వరూ ముందుకురాలేదు. అయితే, నామినేషన్లు వేసేందుకు సిద్ధమైన పసుపు రైతులకు స్థానిక రైతు సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 
 
స్థానిక బీజేపీ నేతలు, ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టువదలని పసుపు రైతులు నామినేషన్ వేయనున్నారు. సోమవారం 45 మంది పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మరోవైపు ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన 8 మంది రైతులు కూడా నామినేషన్లు వేస్తారు. ఇక తమిళనాడులోని ఈరోడు ప్రాంతానికి చెందిన మరో 15 మంది రైతులు కూడా నామినేషన్ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి బరిలోకి దిగిన వారణాసి లోక్‌సభ స్థానానికి ఇప్పటికే స్థానికంగా 60కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మోడీపై పోటీచేసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక తెలంగాణ, తమిళనాడు, ఏపీ రైతులు కూడా నామినేషన్ల వేస్తే.. నామినేషన్ల సంఖ్య 100 దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా వారణాసి లోక్‌సభ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

తర్వాతి కథనం
Show comments