Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను రేప్ చేసిన ఇంటర్ విద్యార్థి.. కరెంట్ షాకిచ్చి చంపేశాడు...

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (13:05 IST)
తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ చదివే విద్యార్థి ఒకరు మృగంలా ప్రవర్తించాడు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. తాను చేసిన పాడుపని బయటకు చెపుతుందన్న భయంతో ఆ చిన్నారికి కరెంట్ షాకిచ్చి చంపేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దిండింగల్ జిల్లా కురుంపట్టికి చెందిన ఓ మైనర్ బాలిక ఏడో తరగతి చదువుతోంది. ఈమె ఇటీవల అనుమానాస్పదస్థితిలో మరణించింది. అయితే, శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయి. ముఖ్యంగా, కరెంట్ షాకిచ్చినట్టుగా గుర్తులు కనిపించాయి. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా, స్థానికంగా ఉండే ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
ఈ విచారణలో తానే ఈ దారుణానికి తెగబడినట్లు బాలుడు అంగీకరించాడు. ఈ నెల 16వ తేదీన బాలిక ఇంట్లో ఉండగా, తాను లైంగిక దాడికి పాల్పడ్డానని చెప్పాడు. ఆ సమయంలో బాలిక ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి లొంగదీసుకున్నానని చెప్పాడు. చివరగా తనను పోలీసులకు పట్టిస్తుందన్న భయంతో ఆమె నోట్లో కరెంట్ వైర్లు పెట్టి షాక్ ఇచ్చి చంపేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ యువకుడు స్థానికంగా ఉండే ఓ స్కూల్‌లో ఇంటర్ చదువుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం