తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గంటూరు జిల్లా తెనాలికి వచ్చిన ఆయన, ఓ వ్యాపార సంస్థను ప్రారంభించగా, ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత పాలన సరిగా లేదన్నారు. ప్రజాభీష్టం మేరకు పాలన సాగడం లేదన్నారు. పైగా, కాంగ్రెస్ పార్టీ మహావృక్షమన్నారు. పాలనా ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నాలు జరగాల్సి వుందని అన్నారు. ప్రజాభీష్టం మేరకు పాలన సాగకుంటే ఇబ్బందులు తప్పవన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓ మహావృక్షం వంటిదని, లోటుపాట్లు ఉన్నా, అవన్నీ సర్దుకునేందుకు ఎంతో సమయం పట్టదని చెప్పారు. ఎవరికి ఓటు వేయాలన్న విషయం ఓటర్లకు తెలుసునని, వారు తమ అభిప్రాయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారని, ఫలితాల కోసం ఎదురు చూడటం మినహా పోటీ పడిన అభ్యర్థుల ఎదుట మరో మార్గం లేదని అన్నారు.