Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబు వైసిపిలో చేరడానికి ఆమే సూత్రధారి...

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (21:17 IST)
తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని ఎప్పుడూ చెబుతూ ఉండే మోహన్ బాబు ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అది కూడా ఎన్నికలకు మరో 16 రోజులు మాత్రమే ఉండడం. నేరుగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో ఉన్న జగన్ నివాసానికి వెళ్ళి వైసిపి కండువాను మోహన్ బాబు కప్పుకోవడం రాజకీయాల్లో చర్చకు తెరలేచింది.
 
వైసిపిలో మోహన్ బాబు చేరడానికి ఆయన కూతురు మంచు లక్ష్మి ప్రధాన కారణమట. మంచు లక్ష్మి ముందు నుంచి వై.ఎస్. జగన్ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వస్తోంది. మోహన్ బాబు టిడిపిలో ఎంపిగా పనిచేసిన అనుభవం ఉన్నా ఆయన ఈ ఎన్నికల్లో ఆ పార్టీలోకి వెళ్ళకుండా వైసిపిలోకి వెళ్ళడానికి కూతురు ఒత్తిడే కారణమట. కూతురు కోసమే మోహన్ బాబు పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. తన తండ్రి వైసిపిలో చేరిన వెంటనే మంచు లక్ష్మి స్వయంగా కండువాను తీసుకొచ్చి ప్రెస్ మీట్లో మోహన్ బాబుకు వేసి తండ్రికి ముద్దుముద్దుగా ముద్దులు పెట్టి వెళ్ళింది.
 
ఎలాంటి స్వార్థం లేకుండా తన తండ్రి ప్రజా సేవ చేయాలనేది కూతురు లక్ష్మి, కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌ల ఆలోచన. మోహన్ బాబుకు కుమార్తె అంటే ఎంతో ఇష్టం. అందుకే తన కుమార్తె చెప్పినట్లే వైసిపిలో చేరారట మోహన్ బాబు. తాను వైసిపిలో చేరేందుకు మరో కారణం కూడా ఉంది. తాను నడుపుతున్న విద్యానికేతన్ విద్యాసంస్ధలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ బాకీ 19 కోట్ల రూపాయలు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇవ్వలేదు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు మోహన్ బాబు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చివరకు వైసిపిలో చేరిపోయారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments