Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను పార్టీలకు అతీతం.. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందన

నేను పార్టీలకు అతీతం.. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందన
, మంగళవారం, 26 మార్చి 2019 (18:23 IST)
తాజాగా ఫీజు రీయింబర్సుమెంట్ అందడం లేదని విద్యార్థులతో కలిసి మోహన్ బాబు తిరుపతిలో ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీకి చెందిన కుటుంబరావు మోహన్ బాబుపై, శ్రీవిద్యానికేతన్ సంస్థలపై విమర్శలు చేయడంతో మంచు మనోజ్ ఆవేశంతో ఎదురు దాడికి దిగారు. ఈ కారణంగా మంచు కుటుంబం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం అనే టాక్ వచ్చిన తరుణంలో మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. 
 
మీరందరికీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. నేను పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పాటుపడాలనుకుంటాను. ఎవరికైనా సాయం చేసేటప్పుడు ఆ కష్టం తప్ప కులం, మత భేదాలు చూడను. పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్న ఉద్దేశ్యంతోనే నేను ఫీజు రీయింబర్సుమెంట్ కోసం చేసిన దీక్షకి మద్దతుగా ఉన్నాను, అంతేగానీ అందులో రాజకీయ ప్రయోజనాలు ఏవీ లేవని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 
 
నేను తెలుగుదేశం పార్టీ మనిషి మా నాన్నపై, మా విద్యాసంస్థలపై తప్పుడు ఆరోపణలు చేయడం వలన కాస్త ఆవేశానికి లోనై కాస్త కఠినంగా స్పందించాను, దీని వెనుక వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు. మా నాన్నగారు ఎంతో కష్టపడి ఆ కాలేజీని స్థాపించారు. అందులో చదువుతున్న పిల్లలకు అన్యాయం జరగకూడదనే ఆలోచనతోనే మా నాన్నతో నడిచాను.. అని పేర్కొన్నారు. 
 
అలాగే మంచి మనోజ్ ‘‘రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేస్తాడని, ప్రజలకు మంచి చేసే పనులు ఎప్పుడు ఏ పార్టీ మొదలుపెట్టినా మద్దతుగా నిలబడతాడని, ప్రజలకి అన్యాయం చేస్తే ఏ పార్టీనైనా నిలదీస్తాడని మనవి చేసుకుంటున్నాను.'' అంటూ ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రుతిహాసన్‌ను పీవీపీ బ్లాక్ మెయిల్ చేసి.. కాల్ షీట్లు తీసుకున్నారు: నాని