రాజీవ్ మిస్టర్ క్లీన్... అవినీతిపరుడంటే ఎవరూ నమ్మరు : బీజేపీ మంత్రి

Webdunia
గురువారం, 9 మే 2019 (13:54 IST)
మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, రాజీవ్ నంబర్ వన్ అవినీతిపరుడంటూ ఆరోపించారు. దీన్ని బీజేపీ నేత, కేంద్ర మంత్రి శ్రీనివాస ప్రసాద్ తీవ్రంగా ఖండించారు.
 
దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ అనవసరంగా మాట్లాడారని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా, రాజీవ్ అవినీతిపరుడు అంటే దేశంలో ఎవరు నమ్మరన్నారు. రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి నేతలు సైతం రాజీవ్‌ను ప్రశంసల వర్షంలో ముంచెత్తారని గుర్తుచేశారు. 
 
రాజీవ్ గాంధీ తన రాజకీయ జీవితంలో మిస్టర్ క్లీన్‌గా బతికాడని ప్రశంసించారు. ఎల్టీటీఈ కుట్రలో భాగంతో రాజీవ్ గాంధీ హతమయ్యాడన్నారు. చిన్న వయసులోనే రాజీవ్ గాంధీ పెద్ద బాధ్యతలు చేపట్టి దేశానికి సేవ చేశారని కొనియాడారు. మోడీ అంటే తనకు కూడా గౌరవం ఉందని రాజీవ్ గాంధీ జీవితం అవినీతి పరుడిగా ముగిసిందనడం తప్పని సూచించారు. కర్ణాటక రాష్ట్రంలోని చమరాజ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి శ్రీనివాస ప్రసాద్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments