Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్స్‌పైరీ ప్రధానితో కలిసి వేదికను పంచుకోను : తెగేసి చెప్పిన మమతా బెనర్జీ

Webdunia
సోమవారం, 6 మే 2019 (16:27 IST)
ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఎక్స్‌పైరీ ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదికను పంచుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 
 
ఫణి తుఫానుపై మాట్లాడేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మూడుసార్లు ఫోను చేశారు. కానీ, ఆమె ఫోనుకు స్పందించలేదు. దీనిపై మోడీ విమర్శలు గుప్పించారు. ఫణి తుఫాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి ఎలా ఉందని వాకుబు చేసేందుకు ఫోన్ చేశానని, దీదీకి రెండు సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటే ఆమెకు ఎంతో అహంకారం ఉందో ఆలోచించుకోవాలన్నారు. 
 
ఫణి తుఫాన్‌ను కూడా మమత రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. మొదటిసారి ఫోన్ చేసినప్పుడు ఆమె లిఫ్ట్ చేయలేదని, ఆమె తనకు రీటర్న్ ఫోన్ చేస్తుదనుకున్నా ఆమె చేయకపోవడంతో మళ్లీ తాను రెండోసారి దీదీకి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
దీనిపై దీదీ స్పందించారు. సారీ... స్పందించడంలో కాస్త ఆలస్యమైనట్టుంది! ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నాను అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఎక్స్‌పైరీ ప్రధానితో కలిసి వేదికను పంచుకునేందుకు లేదా సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పారు. 
 
కాగా, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‍తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తుఫాను బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అలాగే, తుఫాను నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఒక్క ఒడిశాలోని తుపాన్ ధాటికి 20 మంది మృతి చెందారు. అలాగే, ఫణి తుఫాన్ నేపథ్యంలో ఒడిశాకు తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు రూ.10 కోట్లు, ఛత్తీసగఢ్ రూ.11 కోట్లు, గుజరాత్ రూ.5 కోట్ల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments