Webdunia - Bharat's app for daily news and videos

Install App

17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం పరిసమాప్తం... 19న పోలింగ్

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (20:03 IST)
దేశ 17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. తుది దశ అంటే ఏడో విడత పోలింగ్ ఈ నెల 19వ తేదీ ఆదివారం జరుగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లో 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతాయి. 23వ తేదీన సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.
 
కాగా చివరి దశలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 13 స్థానాలు, పంజాబ్‌లో 13 స్థానాలు, వెస్ట్ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3 చొప్పున లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతుంది.  కు పోలింగ్‌ కొనసాగనుంది. యూపీలో మొత్తం 13 స్థానాల్లో 167 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తుది విడతలో పశ్చిమబెంగాల్ లోని 9 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
 
ఈ చివరి దశ పోలింగ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ (వారణాసి)తో పాటు.. కేంద్ర మంత్రి హర్దీప్  సింగ్ పూరి (అమృతసర్), సన్నీడియోల్ (గురుదాస్‌పూర్), కేంద్రమంత్రి హరిసిమ్రత్ కౌర్ (భటిండా), పాట్నాసాహిబ్ స్థానం నుంచి శతృఘ్నసిన్హా (కాంగ్రెస్), బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లు బరిలో ఉన్నారు. 59 సీట్లలో మొత్తం 918 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments