Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ళ కాలంలో మూడు రెట్లు పెరిగిన మమతా బెనర్జీ మేనల్లుడి ఆస్తులు

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:14 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నారు. ఈమె ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, ఓ పార్టీ అధినేత్రిగా ఉన్నప్పటికీ అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. చివరకు సీఎం చాంబర్‌లో కూడా ఆమె చెక్క కుర్చీలోనే కూర్చొంటారు. 
 
కానీ, ఆమె కుటుంబీకులు మాత్రం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనికి నిదర్శనమే ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఈయన 2014లో తొలిసారి డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. 
 
ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నాడు ఆయన చరాస్తులు రూ.23.57 లక్షలు ఉండగా.. ఇప్పుడు ఆ ఆస్తులు మూడు రెట్లు పెరిగాయి. ఇటీవల దాఖలు చేసిన నామినేషన్‌ పత్రంలో తనకున్న చరాస్తుల విలువ రూ.71.4 లక్షలుగా అభిషేక్‌ బెనర్జీ చూపించారు. 
 
వీటితోపాటు రూ.96 వేల విలువ చేసే 30 గ్రాముల బంగారం, రూ.1500 విలువ చేసే 40 గ్రాముల వెండి ఉన్నట్లు తెలిపారు. అభిషేక్‌ భార్య పేరిట రూ.1.5 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆయన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన భార్య పేరిట భార్య పేరిట 658 గ్రాముల బంగారం, 2.3 కేజీల వెండి ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments