ఈనెల 9న ఒడిశాలో పర్యటించనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (13:16 IST)
ఆంధ్రప్రదేశ్లో కీలక ప్రాజెక్టుల పూర్తిపై రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఈనెల 9న ఒడిశాలో పర్యటించనున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించనున్నారు. ముఖ్యగా జలవివాదాల పరిష్కారంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. వంశధార నదిపై నిర్మిస్తున్న నేరడి బ్యారేజ్ పూర్తి చేయడానికి ఒడిశా ప్రభుత్వ సహకారాన్ని కోరనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. జగన్ తన పర్యటనలో ఒడిశా సీఎంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను కలవనున్నారు.
 
 
వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణంతో శ్రీకాకుళం, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలని ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని.. బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని గతంలో రాసిన లేఖలో సీఎం జగన్.. నవీన్ పట్నాయక్‌ ను కోరారు. ఆ క్రమంలో జగన్ ఒడిశా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా ప్రభుత్వం తొలి నుంచి అభ్యంతరాలు తెలుపుతోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని ఒడిశా వాదిస్తోంది. నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఒడిశా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో "చెన్నై లవ్ స్టోరీ" ఒకటి కాబోతోంది - హీరో కిరణ్ అబ్బవరం

Hero Venkat: హీరో వెంకట్ మాస్ ఎంటర్ టైనర్ హరుడు

ఖైదీలకు 23 చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం : సౌమ్య మిశ్రా

హనీ మేడమ్ సెల్ఫీ ప్లీజ్ అంటూ నటి నడుమును అసభ్యంగా తాకిన వ్యక్తి, వీడియో వైరల్

Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో చిత్రం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

తర్వాతి కథనం
Show comments