Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిడెడ్ స్కూల్స్ విలీనంపై జగన్ సర్కారు వెనక్కి!

ఎయిడెడ్ స్కూల్స్ విలీనంపై జగన్ సర్కారు వెనక్కి!
, బుధవారం, 3 నవంబరు 2021 (10:56 IST)
ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. విలీనానికి అంగీకరించిన యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించింది. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ విషయం స్పష్టం చేశారు.
 
'ప్రభుత్వంలో విలీనానికి ఇప్పటికే అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. దీనికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. యథాతథంగా తమ విద్యాసంస్థలను నడుపుకోవచ్చు' అని సీఎం వెల్లడించారు. 
 
'ఎయిడెడ్‌ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరం. దీంట్లో రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరం' అని ఆయన వ్యాఖ్యానించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 
 
మరోవైపు,  ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిపై సర్కారు దిగొచ్చింది. విలీనంతో విద్యా వ్యవస్థ ధ్వంసమవుతుందని, ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయగా మిగిలిపోతాయంటూ మీడియాలో వచ్చిన కథనాలతోపాటు ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. 
 
ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని 1:20గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలల విలీనం కొనసాగాలని, అయితే 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు కాకుండా 20 మందికి ఒకరు చొప్పున ఉండాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్‌ చినవీరభద్రుడు మెమో జారీ చేశారు. ఇప్పటివరకు ఈ నిష్పత్తి 1:30గా ఉండేది. దీనివల్ల ప్రాథమిక పాఠశాలలన్నీ ఏకోపాధ్యాయగా మారతాయనే ఆందోళన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూడూరులో పై అంత‌స్తులో పొగ‌లు... గ‌గ్గోలు పెట్టిన య‌జ‌మాని