Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్ర విభజన హామీలను త్వరగా తేల్చాలి : సీఎం జగన్

రాష్ట్ర విభజన హామీలను త్వరగా తేల్చాలి : సీఎం జగన్
, గురువారం, 4 నవంబరు 2021 (10:54 IST)
ఈ నెల 14వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలతో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది. ఇందులో రాష్ట్ర విభజన హామీలతోపాటు అపరిష్కృత అంశాలు, పెండింగ్‌ బకాయిల గురించి ప్రధానంగా ప్రస్తావించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 
 
సదరన్‌ కౌన్సిల్‌ భేటీలో చర్చకు తేవాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించి 6కిపైగా అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. 
 
ప్రధానంగా విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌ అంశాలను అజెండాలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రెవెన్యూ లోటు, రేషన్‌ బియ్యంపై హేతుబద్ధతలేని కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్‌లైస్‌ బకాయిలు, పోలవరం రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని సూచించారు. 
 
అలాగే, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా వీలైనంత త్వరగా సాకారమయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై వివరాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. కౌన్సిల్‌ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలుంటే తగిన రీతిలో స్పందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాట్ పన్నులు తగ్గించిన ఏపీ - తెలంగాణ - ధరలు తగ్గించిన 9 రాష్ట్రాలు