Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎసి కెపాసిటీని టన్నుల్లో లెక్కిస్తారు.. ఎందుకో తెలుసా?

వేసవి ఎండలు మండిపోతున్నాయి. జనం అల్లాడిపోతున్నారు. కానీ ఎ.సి.లు, ఫ్యాన్లు, కూలర్లు అమ్మే వ్యాపారులకు వాటిని తయారుచేసే కంపెనీలకు వేసవి వచ్చిందంటే అంతాఇంతా ఆనందం కాదు. ఈ ఎండలు ఇంకా మండిపోవాలని కూడా వారు కోరుకుంటారు. ఎందుకంటే ఎండలు ఎంత తీక్షణంగా ఉంటే ఎస

Webdunia
మంగళవారం, 8 మే 2018 (14:41 IST)
వేసవి ఎండలు మండిపోతున్నాయి. జనం అల్లాడిపోతున్నారు. కానీ ఎ.సి.లు, ఫ్యాన్లు, కూలర్లు అమ్మే వ్యాపారులకు వాటిని తయారుచేసే కంపెనీలకు వేసవి వచ్చిందంటే అంతాఇంతా ఆనందం కాదు. ఈ ఎండలు ఇంకా మండిపోవాలని కూడా వారు కోరుకుంటారు. ఎందుకంటే ఎండలు ఎంత తీక్షణంగా ఉంటే ఎసిలు, కూలర్లు, ఫ్యాన్లు అంత ఎక్కువగా అమ్ముడుపోతాయి కాబట్టి. ఇటీవల కాలంలో ఆర్థిక స్థోమత కాస్త లేనివాళ్ళు కూడా ఎసిలను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.
 
ఎసి కొనుగోలు కోసం షాపుకు వెళ్ళినప్పుడు 1 టన్ ఎసి కావాలా, 1.5 టన్ ఎసి కావాలా అని అడుగుతుంటారు. ఇంతకీ ఎసిలను టన్నుల్లో ఎందుకు చెబుతున్నారు. సాధారణంగా బరువులను కొలవడానికి టన్నులు ఉపయోగిస్తారు. 1 టన్ ఎసి అంటే ఆ ఎసి బరువు ఒక టన్ను ఉంటుందనా? కాదు ఎసిల సామర్థ్యాన్ని (కెపాసిటీని) టన్నుల్లో లెక్కిస్తారు. ఇంతకీ ఎసికి టన్నుల లెక్క ఎలా వచ్చిందంటే.
 
ఎయిర్ కండిషనర్ అంటే వాతావరణంలోని గాలిని మనం అనుకున్న కండిషన్‌లోకి తీసుకురావడమే. గాలిలోని ఉష్ణోగ్రతను తగ్గించడం. ఒకప్పుడు ఎసిలు లేనప్పుడు ఆర్థిక స్థోమత ఉన్నవాళ్ళు మంచుగడ్డలను కొనుగోలు చేసి ఇంటిలో పెట్టుకునేవాళ్ళు. అది కరిగి చల్లదనాన్ని ఇచ్చేది. అమెరికాలో ఇలాంటి మంచుగడ్డలను టన్నుల్లో విక్రయించేవారు. గది విస్తీర్ణం బట్టి ఒక టన్ను, ఒకటిన్నర టన్ను, రెండు టన్నులు లెక్కన ఐస్ గడ్డలను కొనుగోలు  చేసేవారు. ఈ లెక్కలే ఎసిలకూ వచ్చింది. కొండగుర్తుగా చెప్పాలంటే ఒక టన్ను మంచుగడ్డకు సమానమైన చల్లదనాన్ని ఇచ్చే ఎసిని 1 టన్ను ఎసి అంటారు. అదే 1.5 టన్నుల మంచుగడ్డతో సమానమైన చల్లదనాన్ని ఇచ్చే ఎసిని 1.5 టన్ను ఎసి అంటారు. 
 
ఒక టన్ను మంచుగడ్డ 2,86,000బిటియు (ట్రిటీష్‌ థర్మరల్ యూనిట్స్ - ఉష్ణాన్ని కొలిచే పరిణామం) వేడిని గ్రహిస్తుంది. దీన్ని ఒక రోజుకు లెక్కిస్తే టన్ను మంచుగడ్డ 24 గంటల్లో యూనిఫాంగా కరిగితే గంటకు 11, 917 బిటియు వేడిని గ్రహిస్తుంది. అంటే గాలి నుంచి తొలగిస్తుంది. దీన్ని 12వేల బిటియు గంటగా స్థీరీకరించారు. అంటే గంటకు 12 వేల బిటియు వేడిని తొలగించే సామర్థ్యమున్న ఎసిని 1 టన్ ఎసి అంటారు. 1.5 టన్ ఎసి అంటే గంటకు 18 వేల బిటియు వేడిని తొలగిస్తుందన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments