Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేతికి అందే మేఘాలు... ముద్దాడే వానచినుకులు... ఈ వేసవిలో అలా తొంగిచూస్తే...

వేసవి కాలం వచ్చింది. ఈ వేసవి తాపాన్ని తప్పించుకోవాలంటే ఏదో ఒక చల్లటి ప్రదేశానికి వెళ్లవలసిందే. మనం చూడదగ్గ ప్రదేశాలలో చిరపుంజి ఒకటి. చేతికి అందే ఎత్తులో మేఘాలొచ్చి పలకరిస్తే ఎంత బాగుంటుందీ.... ఆ మరుక్షణమే ముత్యాల్లాంటి వాన చినుకులొచ్చి మనల్ని ముద్దాడ

చేతికి అందే మేఘాలు... ముద్దాడే వానచినుకులు... ఈ వేసవిలో అలా తొంగిచూస్తే...
, శనివారం, 5 మే 2018 (20:19 IST)
వేసవి కాలం వచ్చింది. ఈ వేసవి తాపాన్ని తప్పించుకోవాలంటే ఏదో ఒక చల్లటి ప్రదేశానికి వెళ్లవలసిందే. మనం చూడదగ్గ ప్రదేశాలలో చిరపుంజి ఒకటి. చేతికి అందే ఎత్తులో మేఘాలొచ్చి పలకరిస్తే ఎంత బాగుంటుందీ.... ఆ మరుక్షణమే ముత్యాల్లాంటి వాన చినుకులొచ్చి మనల్ని ముద్దాడుతుంటే ఇంకెంత బాగుంటుందీ... నిత్యనూతనమైన ఇలాంటి ఆనందానుభూతులకు లోగిలే ఈశాన్య భారతావనికి చెందిన మేఘాలయలోని సోహ్రా ఉరఫ్ చిరపుంజి. ఇది చూడటానికి ఎంతో బాగుంటుంది. ఆ చూడదగ్గ ప్రదేశాలలో చిరపుంజి ఒకటి. 
 
ఒకప్పుడు ప్రపంచంలో కెల్ల అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసుకున్న చిరపుంజి అందాలు చాలా బాగుంటాయి. ఎత్తైన కొండల్లో, ఇరుకైన దారుల్లో చిరపుంజి ప్రయాణం చాలా బాగుంటుంది. దారికి ఇరువైపులా ఎటు చూసినా బొగ్గు, ఇసుకరాయి, సున్నపురాయి గనులే. కాశీ కొండల అంచుల్లో ఉన్నట్లున్న చిరపుంజికి చుట్టూ లోతైన లోయలే. చిరపుంజిలోని నాహ్ కాలికాయ్ అనే జలపాతం ప్రపంచంలో కెల్లా నాల్గవ ఎత్తైన జలపాతం. ఇది చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. కమలాలు, ఫైనాపిల్ తోటలకు మాత్రం ఈ చిరపుంజీకి పెట్టింది పేరు. ఈ రెండు పండ్లు ఇక్కడ ఉన్నంత రుచిగా ఎక్కడా ఉండవు.
 
ఇక్కడ రామకృష్ణ మిషన్ చూడటానికి అద్భుతంగా ఉంటుంది. అక్కడ 2009 మార్చి31 న మంచు వర్షం కురిసిందట. ఆ చిత్రాలు అక్కడ ఉన్న మ్యూజియంలో ఉన్నాయి. ప్రజల సంస్కృతికి అద్దంపట్టే ప్రదర్శనలు కూడా అక్కడ చాలా ఉన్నాయి. అక్కడకు దగ్గరలో ఉన్న షిల్లాంగ్‌లో ఎటుచూసినా జలపాతాలు, పచ్చదనాన్ని కప్పుకున్న ఎతైన కొండశిఖరాలతో షిల్లాంగ్ చూసేకొద్ది చూడాలనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులు తప్పక చూడాల్సిన ప్రాంతాలలో ఇది ఒకటి. షిల్లాంగ్ వెళ్లినవారు డాన్ బాస్కో అనే ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి. 
 
ఏడు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను చాటే విశేషాలన్నింటిని అక్కడ పొందుపరిచారు. ఆసియా ఖండం లోనే అతి పెద్ద సాంస్కృతిక మ్యూజియం ఇది. సముద్ర మట్టానికి 1965 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం మీద నుంచి చూస్తే షిల్లాంగ్ పట్టణం ఎంతో అందంగా కనిపిస్తుంది. షిల్లాంగ్‌లో చూడదగ్గ మరో సుందర ప్రదేశం ఏనుగు జలపాతం. ఈ జలపాతానికి ఒక వైపు ఉన్నరాయి అచ్చం ఏనుగులా ఉండేదట. 
 
అక్కడ మరో విశేషమేమిటంటే చిన్నచిన్న జలపాతాలు అన్నీ కలసి ఒకే జలపాతంలా కనిపిస్తాయి. అక్కడకు దగ్గర లోనే సీతాకోకచిలుకల మ్యూజియం ఉంది. ప్రపంచంలోనే విభిన్న జాతులకు చెందిన సీతాకోకచిలుకలు అక్కడ ఉన్నాయి. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కాబట్టి ఈ వేసవిలో ఓ ట్రిప్ వేస్తే ఆ మజానే వేరుమరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాస‌రెడ్డి 'జంబల‌కిడి పంబ' నిర్ణ‌యం స‌రైన‌దేనా..?