శ్రీనివాసరెడ్డి 'జంబలకిడి పంబ' నిర్ణయం సరైనదేనా..?
ఆరోజుల్లో సంచలన విజయాలు సాధించిన చిత్రాల టైటిల్స్ పెట్టుకుని సినిమాలు తీయడం... అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం చూస్తునే ఉన్నాం. అంతేకాకుండా.. మంచి టైటిల్‌ను చెడగొడుతున్నారు అనే వాదన కూడా ఉంది. నాగార్జున కెరీర్లో మరచిపోలేని చిత్రం గీతాం
ఆరోజుల్లో సంచలన విజయాలు సాధించిన చిత్రాల టైటిల్స్ పెట్టుకుని సినిమాలు తీయడం... అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం చూస్తునే ఉన్నాం. అంతేకాకుండా.. మంచి టైటిల్‌ను చెడగొడుతున్నారు అనే వాదన కూడా ఉంది. నాగార్జున కెరీర్లో మరచిపోలేని చిత్రం గీతాంజలి. ఇదే టైటిల్‌తో అంజలి ప్రధాన పాత్రలో హర్రర్ మూవీ తీసారు. దీంతో హర్రర్ మూవీకి ఈ టైటిల్ ఏంటి...? అని చాలామంది విమర్శించారు.
స్వయంగా నాగార్జునే హర్రర్ మూవీకి గీతాంజలి టైటిల్ పెట్టారని వినగానే కోపం వచ్చిందని చెప్పారు. అలాగే తెలుగు చలనచిత్ర చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిన చిత్రం శంకరాభరణం. ఈ టైటిల్‌తో నిఖిల్ హీరోగా సినిమా వచ్చింది. ఎంతటి పరాజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక అసలు విషయానికి వస్తే.... ఇ.వి.వి జంబలకిడి పంబ అనే హాస్య చిత్రాన్ని తెరకెక్కించడం.. ఇది ఘన విజయం సాధించడం తెలిసిందే.
ఇప్పుడు ఇదే టైటిల్‌తో శ్రీనివాస్ రెడ్డి.. సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తూ ఓ సినిమా చేస్తున్నారు. హాస్యానికి పెద్దపీట వేసిన ఈ సినిమాకి మురళీకృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. టీజర్ చూస్తుంటే... కామెడీ కావలసినంత ఉందనిపిస్తోంది. మరి.. ఇవివి 'జంబలకిడి పంబ' మాదిరిగానే, ఈ సినిమా కూడా విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి.