Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

175 నియోజక వర్గాల్లోనే జగన్ పాదయాత్ర... ఫ్లైట్‌లో శుక్రవారం కోర్టుకు వస్తారా?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోంది. పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ 125 నియోజక వర్గాలు మాత్రమే పాదయాత్ర చేస్తారని.. మిగిలిన నియోజక వ

175 నియోజక వర్గాల్లోనే జగన్ పాదయాత్ర... ఫ్లైట్‌లో శుక్రవారం కోర్టుకు వస్తారా?
, ఆదివారం, 22 అక్టోబరు 2017 (16:49 IST)
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోంది. పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ 125 నియోజక వర్గాలు మాత్రమే పాదయాత్ర చేస్తారని.. మిగిలిన నియోజక వర్గాల్లో బస్సు యాత్ర చేస్తారని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజా తెలిపారు. 
 
అస్సలు జగన్ 125 నియోజక వర్గాల్లో మాత్రమే పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే దానిపై చర్చ మొదలైంది. ఆరు నెలల పాటు పాదయాత్ర పైనే దృష్టి పెడితే మిగతా కార్యక్రమాల్లో ముందుకు సాగలేం, అదికూడా 6 నెలల్లో 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర చెయ్యాలంటే సమయం వుండదనే ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జగన్ సీఎం కావాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను వైసీపీ అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 2019లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం, జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు. 
 
ఇక జగన్ తన ఆస్తుల కేసు విషయంలో వ్యక్తిగతంగా ప్రతి శుక్రవారం హాజరు కావాలని కోర్టు షరతు విధించింది. ఈ క్రమంలో జగన్ తనకు వ్యక్తిగత హాజరు మినహాయించాలని కోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ కేసును కోర్టు ఈ శుక్రవారానికి వాయిదా వేశారు. 
 
ఒకవేళ కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే పాదయాత్రకు ఎక్కడ బ్రేకులు పడతాయోనని వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు.. ఈ క్రమంలో పాదయాత్రకు ఆటంకం కలగాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం ప్రత్తేక  విమానం ద్వారా కోర్టుకు హజరు కావాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా.. బాలికపై దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌లో...(Video)