అమ్ముడు పోలేదు.. అభివృద్ధి కోసమే సైకిలెక్కుతున్నా : బుట్టా రేణుక
వైకాపాకు చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైపోయింది. తెదేపాలో చేరే విషయంపై ఇంతకాలం దాగుడుమూతలాడుతూ వచ్చిన బుట్టా రేణుక... తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని తేలడంతో ఆమెపై వై
వైకాపాకు చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైపోయింది. తెదేపాలో చేరే విషయంపై ఇంతకాలం దాగుడుమూతలాడుతూ వచ్చిన బుట్టా రేణుక... తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని తేలడంతో ఆమెపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సస్పెన్ష్ వేటు వేసి విషయం తెల్సిందే.
దీంతో ఆమె మంగళవారం విజయవాడకు చేరుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై అధికారికంగా పసుపుజెండా కప్పుకోనున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రేణుక భర్త ఇప్పటికే టీడీపీలో కొనసాగుతున్న విషయం తెల్సిందే.
కాగా, పార్టీ మార్పుపై ఆమె స్పందిస్తూ.. అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నానని, కర్నూల్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటుచేసి లాంఛనంగా పార్టీలో చేరుతానని చెప్పారు. టీడీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న బట్టారేణుక, మంగళవారం ఉదయం అనుచరులతో కలిసి విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
ఆయనతో కాసేపు చర్చించిన ఆమె, అనంతరం తన చేరిక గురించి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.., అభివృద్ధి కోసమే టీడీపీకి మద్ధతునిచ్చానని, అభివృద్ధిని కోరుకునే వారంతా టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక రేణుకతో పాటు ఆమె అనుచరులకు కూడా కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు.