అజిత్‌కు అరుదైన గౌరవం.. ఎంఐటీలో యూఏవీ సిస్టమ్ అడ్వైజర్‌గా.. రూ.1000 జీతం?
కోలీవుడ్ అందగాడు అజిత్‌కు అరుదైన గౌరవం దక్కింది. అజిత్‌ను "హెలికాప్టర్ టెస్టు పైలట్ అండ్ యూఏవీ సిస్టమ్ సలహాదారుడి''గా మద్రాస్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నియమించింది. ఇలాంటి అరుదైన గుర్తింపు
కోలీవుడ్ అందగాడు అజిత్‌కు అరుదైన గౌరవం దక్కింది. అజిత్‌ను "హెలికాప్టర్ టెస్టు పైలట్ అండ్ యూఏవీ సిస్టమ్ సలహాదారుడి''గా మద్రాస్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నియమించింది. ఇలాంటి అరుదైన గుర్తింపు తెచ్చుకున్న తొలి నటుడిగా అజిత్ రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం అజిత్ దర్శకత్వంలోని ''విశ్వాసం''లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.
అజిత్‌కు సినిమాలతో పాటు బైక్, కారు రేస్, ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఎక్కువ. ఇటీవల హెలికాఫ్టర్లు, బుల్లి విమానాలు తయారు చేస్తూ వచ్చిన అజిత్.. వాటిని విజయవంతంగా ఎగురవేశారు. అంతేగాకుండా డ్రోన్‌ల తయారీపై కూడా అజిత్ దృష్టి పెట్టారు.
ఈ విషయంపై అధ్యయనం చేసేందుకు కొన్ని రోజుల క్రితం ఎంఐటీకి అజిత్ వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అజిత్ ఆసక్తిని ఆయకున్న నైపుణ్యతను గమనించిన ఐఐటీ.. ఆయనను హెలికాప్టర్ టెస్టు పైలట్‌గా నియమించింది.
ఇందుకోసం రెండు గంటల పాటు అజిత్ ఎంఐటీ విద్యార్థులతో సెషన్ నిర్వహించారని.. ఈ సెషన్ కోసం అజిత్‌కు ఐఎంటీ రూ.1000లు ఆఫర్ చేసిందట. ఆ మొత్తాన్ని కూడా అజిత్ విద్యార్థుల నిధికి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలుస్తోంది. డ్రోన్ తయారీని చాలా వేగంతో అజిత్ పూర్తిచేస్తారని.. అతి వేగంతో డ్రోన్‌ను అసెంబల్ చేసేవారని ఎంఐటీ ప్రొఫెసర్లు వెల్లడించారు. కాగా మే7వ తేదీ నుంచి అజిత్ విశ్వాసం సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.