విప్రోకు ఎంత పెద్దమనసు.. రోజుకు 60వేల మందికి ఆహారం

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (11:10 IST)
కరోనా మహమ్మారి ప్రపంచ దేశ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. దీంతో పలు దేశాలు లాక్ డౌన్‌లో వున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు తంటాలు పడుతున్నాయి. ఇలా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం, వైద్య ఖర్చుల కోసం సెలెబ్రిటీలు, ప్రముఖులు సాయం చేస్తున్నారు. ఇలా ఐటీ సంస్థల్లో ఒకటైన విప్రో యాజమాన్యం కూడా కరోనాపై పోరుకు తన వంతు సాయం చేస్తోంది. 
 
ఈ క్రమంలో తమ సంస్థ ప్రతిరోజు 20 లక్షలకు పైగా ప్రజలకు ఆహారాన్ని సరఫరా చేసిందని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సోమవారం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్‌ కష్టాలు పడుతున్న ప్రజలకు అందిస్తున్న ఇతర సంస్థలు తీసుకున్న సహాయక చర్యలను ఆయన ప్రశంసించారు. మహమ్మారితో పోరాడుతున్న దేశానికి అందరూ సహాయ, సహకారాలు అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
విప్రో క్యాంపస్ క్యాంటీన్ల ద్వారా 14-21 రోజులుగా రోజూ 60 వేలకు పైగా ప్రజలకు తాజాగా వండిన భోజనాన్ని, పూర్తిస్థాయి రేషన్ సరుకులను అందజేశామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని ప్రకటించారు.
 
కాగా కోవిడ్ -19 తో పోరాడటానికి అజీమ్ ప్రేమ్‌జీ యాజమాన్యంలోని విప్రో ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఫౌండేషన్ ప్రతిజ్ఞ రూ.1125 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే టాటా గ్రూప్ మొత్తం రూ .1,500 కోట్లను ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments