Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ న్యూస్‌ను వాట్సాప్‌లో కనిపెట్టేయవచ్చు తెలుసా?

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (17:27 IST)
కరోనాపై తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతున్నందున దానిని అడ్డుకోవాలని సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సప్ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కరోనా వైరస్ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్న నేపథ్యంలో ఏదైనా ఫేక్ న్యూస్ వైరల్‌గా మారితే పెను ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
 
ఇలాంటి పరిస్థితుల్లో యాండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు కలిపి కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది వాట్సాప్. ఈ ఫీచర్‌తో ఫేక్ న్యూస్‌ను ఇట్టే పసిగట్టేయొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని WAbetainfo తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. 
 
మెసేజ్ పక్కన సెర్చ్ ఆప్షన్‌తో ఉన్న ఫొటోను కూడా పోస్టు చేసింది. ఇంకా అధికారికంగా దీనిని విడుదల చేయలేదు. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. యూజర్లు మెసేజ్ పక్కనే ఉన్న సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే దానిని గూగుల్‌లో సెర్చ్ చేయాలా అని అడుగుతుంది. యస్ అంటే వెబ్‌లో సెర్చ్ అవుతుంది. తద్వారా మెసేజ్ నిజమో.. ఫేకో ఇట్టే తెలుసుకోవచ్చునని ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థ వాట్సాప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments